Sunday, January 25, 2009

మింద ఏమిటి నీ బొంద! మా మాష్టారు చెప్పుండ్లా

అదేందో గానీ నేను పిలగాయగున్నప్పుట్నుంచీ హైకూలన్నా, మైకూలన్నా, కవీతలన్నా మింద పడిపోటమే.ఎవరి మింద ? మింద ఏమిటి నీ బొంద, బొంద కాదురా బొండాం, బొండామా కందమా అంటే హైకూ డొక్కలో మత్తేభంతో పొడిపిస్తా, ఎన్నుపూసని శార్దూలంతో చీరేయిస్తానంటే పక్కన ఉన్న దున్ననెక్కి దిన్నెల మీద లగెత్తటమే నీ తేటకి గీతి అని మా మాష్టారు చెప్పుండ్లా.

కాబట్టి ఇగ కాస్కోండి.

ఏంది సగం ఆంధ్రం, సగం సీమం మాట్టాడుతుండావు అనుంటుండావా? గదంతేలే పూసమ్మా !

కృష్ణ కుమార్